విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సీపీ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మంక్రైం : తాళం వేసి ఉన్న ఇళ్లనే అతడు లక్ష్యంగా చేసుకొంటాడు. అంతే తన వద్ద ఉన్న వస్తువులతో చాకచక్యంగా తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకుంటాడు. 6 నెలల పాటు దొంగతనాల జోలికి వెళ్లకుండా దొంగిలించిన సొత్తుతో జల్సాలు చేస్తూ తిరుగుతాడు.. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌తో పాటు హైదరాబాద్ ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఓ గజ దొంగను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి సుమారు రూ.12లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఖమ్మం సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన మనిగండ్ల విజయ్‌కుమార్ కూలీపనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి అక్కడ చింతల్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లో జీవిస్తూ విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డాడు. జల్సాలకు డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకొన్నాడు. దీనికితోడు మహిళలతో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొన్నాడు.
తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తాళం పగులగొట్టి చోరీలు చేసేవాడు. హైదరాబాద్‌లోని పరిసర ప్రాంతాల్లో 34 చోరీలు చేశాడు. వాటిలో 19 రాత్రి దొంగతనా లు, 13 పగటి దొంగతనాలు, 12 సాధారణ దొం గతనాలు చేసి జైలు శిక్ష సైతం అనుభవించాడు.
ఖమ్మం వచ్చి..
కొత్తగూడెంలో బస్టాండ్ ఎదురుగా ఓ గది అద్దెకు తీసుకొని అక్కడ నుంచి ప్రతిరోజూ ఖమ్మం నగరానికి వచ్చి దొంగతనాలు చేసి వెళ్లిపోతూ ఉండేవాడు. ఒక్కఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఆరు, ఖమ్మం వన్‌టౌన్‌లో ఒకటి, ఖానా పురం హవేలిలో ఒకటి, సత్తుపల్లి, చుంచుపల్లి, కూసుమంచి, ఖమ్మం త్రీటౌన్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున చోరీలు చేశాడు.
ఇలా చిక్కాడు..
వరుసగా చోరీలకు పాల్పడుతున్న ఈ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నా వారికి దొరకకుండా చోరీలకు పాల్పడే వాడు. వేలిముద్రల ఆధారంగా విజయ్‌కుమార్ ను గుర్తించిన సీసీఎస్ పోలీçసులు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా వ్యవహారం బయటపడింది. అతని వద్ద రూ.12 లక్షల సొత్తు స్వాధీనం చేసుకొన్నారు.
నెల గడువులోనే..
నెల గడువులోనే సీసీఎస్ పోలీసులు రెండు చోరీ కేసులను ఛేదించటం పట్ల సీపీతఫ్సీర్ ఇక్బాల్ సీసీఎస్ పోలీసులను అభినందించారు. గతంలో సీసీఎస్ పోలీస్‌స్టేషన్ సిబ్బందికి సరైన గుర్తింపు లేదని విమర్శలు వినపడ్డాయి. ప్రస్తుతం అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఏసీపీ ఈశ్వరయ్య, సీఐ కరుణాకర్ తమ సిబ్బందితో టీమ్‌వర్క్ చేస్తూ గత నెల అంతర్ రాష్ట్ర దొంగ లను పట్టుకొన్న సీసీఎస్ పోలీసులు నెల తిరగకముందే మరో దొంగను పట్టుకోవడం విశేషం.
సిబ్బందికి రివార్డులు..
ఈ కేసును ఛేదించిన సీసీఎస్ సిబ్బంది సీఐ కరుణాకర్, ఏఎస్‌ఐ లింగయ్య, సిబ్బంది సాధిక్, డి. డానియల్, సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్ రాజ్‌కుమార్, క్లూస్‌టీమ్ సిబ్బంది జమలయ్యకు సీపీ తఫ్సీర్ ఇగ్బాల్ రివార్డులు అందజేశారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్, ఏసీపీలు వెంకట్రావ్, ఈశ్వరయ్య సీఐలు వెంకన్నబాబు, రాజిరెడ్డి, రమేష్, ఎస్‌ఐ యల్లయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment