దేవేంద్ర స్థానం కొల్హాపూర్ ఎమ్మెల్సీ చంద్రకాంత్‌కి? | Kolhapur MLC Chandrakant Patil may succeed Devendra Fadnavis as Maharashtra BJP chief | Sakshi
Sakshi News home page

దేవేంద్ర స్థానం కొల్హాపూర్ ఎమ్మెల్సీ చంద్రకాంత్‌కి?

Published Wed, Oct 29 2014 11:43 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

దేవేంద్ర స్థానం కొల్హాపూర్ ఎమ్మెల్సీ చంద్రకాంత్‌కి? - Sakshi

దేవేంద్ర స్థానం కొల్హాపూర్ ఎమ్మెల్సీ చంద్రకాంత్‌కి?

ముంబై: దేవేంద్ర ఫడణవిస్ సీఎం కావడం కొల్హాపూర్ బీజేపీ ఎమ్మెల్సీ చంద్రకాంత్ పాటిల్‌కి కలిసొచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రకాంత్‌కు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవీ బాధ్యతలను అప్పగించే అవకాశముందని తెలియవచ్చింది. ఈ నెల 31వ తేదీ తరువాత ఆయనను ఈ పదవి వరించనుందని వాంఖడే స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఓ నాయకుడు తెలియజేశారు. చంద్రకాంత్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఇదిలాఉంచితే బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్‌కు మంత్రి పదవి దక్కే అవకాశముండడంతో ఈ పదవి కూడా ఖాళీ అయ్యే అవకాశముంది. ఈ పదవి విలేపార్లే ఎమ్మెల్యే పరాగ్ అల్వనికి ద క్కే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement