
అందరి కంటే అద్వానీయే పెద్ద
న్యూఢిల్లీ: 16వ లోక్సభకు ఎన్నికైన సభ్యుల్లో అందరి కంటే పెద్ద వయస్కుడు బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీయే. అద్వానీ వయసు 86 ఏళ్లు. మొత్తం 543 మంది లోక్సభ సభ్యుల్లో 253 మంది 55 ఏళ్లకు పైబడినవారే.
15వ లోక్సభతో పోలిస్తే ప్రస్తుత సభలో పెద్ద వయస్కులు ఎక్కువగా ఉన్నారు. గత సభలో 55 ఏళ్లకు పైబడినవారు 43 శాతం మంది ఉండగా, ఈ సారి ఈ శాతం పెరిగింది. లోక్సభకు ఇంతమంది పెద్ద వయస్కులు ఎన్నికవడం ఇదే తొలిసారి. 40 ఏళ్ల వయసులోపు వారు కేవలం 71 మంది మాత్రమే ఎన్నికయ్యారు.