సాక్షి, న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. రైల్వే హోటళ్ల టెండర్ కేసులో అవినీతికి పాల్పడినట్టు లాలూ కుటుంబసభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే లాలూ, ఆయన తనయుడు తేజస్వి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
గత నెల 10, 11 తేదీల్లో వీరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే, ఈ కేసు విచారణలో మరింత వివరాలు రాబట్టేందుకు మరోసారి లాలూను సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఢిల్లీలోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. రైల్వే హోటళ్ల టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా లాలూ తనవారికి కట్టబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సీబీఐ విచారణకు లాలూ ప్రసాద్ యాదవ్
Published Thu, Oct 5 2017 11:19 AM | Last Updated on Thu, Oct 5 2017 1:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment