లాలూ ప్రసాద్ యాదవ్కు అస్వస్థత
ముంబయి : ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. కాగా లాలూ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యుడు తెలిపారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుతం లాలూ ఆస్పత్రిలోనే ఉన్నారు. మరోవైపు బీహార్లో 10 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అలాగే చాలా కాలం తర్వాత ఆర్జేడీ, జేడీఎస్ కలిసి ఇక్కడ పోటీ చేశాయి.