ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 431 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 5649కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 18 మంది కోవిడ్-19 రోగులు మరణించారని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్-19తో మరణించిన వారి సంఖ్య 269కి పెరిగింది. ఇక ముంబైలోనే అత్యధికంగా 3683 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,000 దాటింది. మహమ్మారి బారినపడి బుధవారం ఒక్కరోజే 49 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment