కాంగ్రెస్‌కే మొగ్గు చూపిన మణిపూర్
మణిపూర్: మణిపూర్ వాసులు స్నేహ ‘హస్తం’ అందించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చివరి వరకూ సాగిన హోరాహోరీగా పోరులో బీజేపీని వెనక్కి తోసి కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల నువ్వా,నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. మొత్తం 60 నియోజవర్గాలకుగానూ ఇప్పటి వరకూ వెల్లడి అయిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 27 కైవసం చేసుకోగా, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. అలాగే బీజేపీ 21 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ పార్టీ 4, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31.
మణిపూర్ లో ఓట్ల లెక్కింపు సాగుతున్న అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఫలితాలు: మొత్తం
బీజేపీ 19, కాంగ్రెస్ 23, ఎన్‌పీఎఫ్ 3, ఇతరులు 6
ఆధిక్యం: బీజేపీ 2, కాంగ్రెస్ 2, ఎన్‌పీఎఫ్ 1, ఇతరులు 1
ఎన్నికల లెక్కింపు సరళి:
-
బీజేపీ 11, కాంగ్రెస్ 7, టీఎంసీ 1, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యం
బీజేపీ అభ్యర్థి సాపం రంజన్ సింగ్ గెలుపు, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కొంతౌజం శరత్ సింగ్ పై 2,772 ఓట్ల తేడాతో విజయం. - బీజేపీ- కాంగ్రెస్ నెక్ అండ్ నెక్ వార్: కాంగ్రెస్ 13 స్థానాల్లో, బీజేపీ 13 స్థానాల్లో ఇతరులు 8స్థానాల్లో ఆధిక్యం
- 10,470 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించిన ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్. కాగా ఇరోం షర్మిలకు పోలైన ఓట్ల సంఖ్య 90
- కాంగ్రెస్ 11 స్థానాల్లో, బీజేపీ 9 స్థానాల్లో , ఎన్‌సీపీ 1, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యం
- కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీజేపీ 14 స్థానాల్లో ఇతరులు 8స్థానాల్లో ఆధిక్యం
- కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాలు, లెఫ్ట్ 1, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యం
-
ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ అఖండ విజయం. దీంతో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఉక్కు మహిళ ఇరోం షర్మిలకు ఓటమి తప్పలేదు. మరోవైపు బీజీపీతో పోలిస్తే కాంగ్రెస్ పుంజుకుంది.
కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాల్లో ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యం - కాంగ్రెస్ 11, బీజేపీ 12 స్థానాలు, ఎంజీపీ 2, ఇతరులు మూడు స్థానాల్లో అధిక్యం
- మణిపూర్ లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో, బీజేపీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
- ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ తోబల్ నియోజక వర్గంలో అధిక్యంలో కొనసాగుతున్నారు.
- మణిపూర్ డిప్యూటీ సీఎం గైఖంగమ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
- కాంగ్రెస్ 7స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ ఒక స్థానంలోనూ, ఇతరులు 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
- మణిపూర్ లో తోబల్ నియోజక వర్గంలో ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల వెనకంజ