Manipur assembly elections
-
బాబు మాటలే బట్టీపట్టి చెబుతున్న షర్మిల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి, రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేని షర్మిల.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియా ఇచ్చిన స్క్రిప్ట్‌నే పోటీ పరీక్షలకు విద్యార్థి సిద్ధమైనట్లుగా బట్టీ పట్టి చదువుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆమె మాట్లాడుతున్న మాటలకు ఒకదానికి, మరొకదానికి పొంతన లేదన్నారు. షర్మిల మాటలను చూస్తే.. బహుశా ఆమె తెలంగాణలో ఉండి మాట్లాడుతున్నట్లుగా అనుకుంటున్నారేమో అని అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సోనియా వేధింపులు షర్మిలకు తెలుసు వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తాళలేక మరణించిన వారి కుటుంబాలకు భరోసా కల్పించడానికి జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి సోనియాగాంధీ యత్నించారు. అప్పట్లో సోనియాను జగన్, విజయమ్మ, షర్మిల కలిశారు. అక్కడేం జరిగిందో షర్మిలకు కూడా తెలుసు. వైఎస్ పథకాలను తుంగలో తొక్కి, ఆశయాలను పక్కన పెట్టేందుకు సిద్ధమైన సోనియాతో విభేదించి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచి కక్ష సాధింపు మొదలు పెట్టి వేధించిన విషయమూ షర్మిలకు తెలుసు. వైఎస్ వివేకానందరెడ్డిని మంత్రిని చేసిన సోనియా.. వైఎస్సార్సీపీ స్థాపించాక పులివెందుల ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మపై వివేకానందరెడ్డిని పోటీ పెట్టడం ద్వారా కుటుంబాన్ని చీల్చిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. ఇప్పుడూ అదే రీతిలో కుటుంబాన్ని చీల్చి షర్మిలను పీసీసీ చీఫ్‌గా చేశారని జగన్ ఎత్తిచూపారు. ప్రజలు జగనే వైఎస్‌కు సరైన వారసుడు అనుకున్నారు కాబట్టే వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. మహానేత వైఎస్ ఆశయ సాధనే ఊపిరిగా.. సీఎం జగన్ వైఎస్సార్ బిడ్డగా ఆ రోజు మొదలు పెట్టిన ప్రస్థానం.. నేడు ఉధృతమైన ప్రవాహంలా సాగుతోంది. దానికి కారణం వైఎస్ ఆశయాలను, ఆలోచనలను జగన్ మనసా వాచా నమ్మి వాటిని మరింత మెరుగుపర్చి అమలు చేస్తున్నారు. పార్టీని నడపడం, విలువలను పాటించడం, నిజాయితీ, నిబద్దతలో ఎన్ని ఆటుపోట్లనైనా తట్టుకొంటూ వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆనాడు అక్రమ కేసుల్లో 16 నెలలు జైల్లో పెట్టడం నుంచి చంద్రబాబు 23మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొన్నప్పుడూ జగన్ చలించలేదు. ఇలా సొంతంగా ఎదిగిన వ్యక్తి జగన్. జగన్ తండ్రి వైఎస్ అని చెప్పుకోవడం ఏ తండ్రికైనా గర్వకారణమే. వైఎస్ బిడ్డగా, జగన్ సోదరిగా షర్మిలకు అభిమానులు గౌరవం ఇస్తారు. గుండెల్లో పెట్టుకుంటారు. ఏం అన్యాయం జరిగిందో షర్మిలే చెప్పాలి జగన్ కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీని స్థాపించినప్పుడు లక్షలాది కార్యకర్తలు ఆయన వెంట కదిలారు. త్యాగాలు చేశారు. అందరూ కష్టపడ్డారు. జగన్ జైలులో ఉన్న సమయంలోనే కదా షర్మిల పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పార్టీ నేతలు, శ్రేణులు, అందరూ ఎంతో కష్టపడ్డారు. అందరికీ రకరకాల బాధ్యతలు అప్పజెప్పారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించారు. షర్మిల పాదయాత్ర చేశారు. అన్యాయం జరిగిందని షర్మిల అంటున్నారు. ఆమెకు ఏం అన్యాయం జరిగిందో స్పష్టంగా చెప్పాలి. పదవి కోసమే ఆమె ఆరోజు జగన్ కోసం నిలబడ్డానని స్పష్టంగా చెప్పగలిగితే సమాధానం చెప్పొచ్చు. పదవుల పంపకంలో అన్యాయం చేశారా? కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది చర్చించడానికి అర్హమైనదేనా? కుటుంబం పదవులు పంచుకొంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? వైఎస్సార్టీపీ కార్యకర్తలకు షర్మిల ఏం న్యాయం చేశారు? తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీ కోసం చాలా మంది కష్టపడి ఉంటారు కదా. వారికి షర్మిల ఏం న్యాయం చేశారు? వారి భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేశారు? వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాష్ట్రానికి వచ్చిన షర్మిలను భుజానికెత్తుకుని మోస్తున్న ఎల్లో మీడియా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో షర్మిలకు భాగముందని ఎందుకు రాయలేదు? అప్పుడూ ఇప్పుడూ జగన్‌పై షర్మిల బాణాలు ఎక్కుపెట్టినప్పుడే వాటినే ఎల్లో మీడియా ప్రచురిస్తోంది. వైఎస్ మరణంపై రేవంత్‌రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు షర్మిల ఎందకు స్పందించలేదు? వైఎస్ పథకాలు లేవంటే తీసుకున్న వాళ్లంతా ఎవరు? వైఎస్ పథకాలను తీసేశారని షర్మిల మాట్లాడితే ఏమనాలో అర్థం కావడంలేదు. చంద్రబాబు, రాధాకృష్ణ వద్ద నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీ పట్టి చెప్పినప్పుడు వాస్తవాలు ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. అప్పట్లో వైఎస్ అమలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా ఇప్పుడు షర్మిల లేవంటున్నారు. రైతులకు నేడు ఇస్తున్నంత భరోసా దేశంలో మరెక్కడైనా ఉందా? అసలు క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటున్నారు. తీసుకున్న రైతులంతా ఏమనుకుంటారు? పాపం ఆమె తెలియక ఇంత అబద్ధం మాట్లాడి ఉండొచ్చు. బహుశా చంద్రబాబు కూడా వీటిపై మాట్లాడటానికి సాహసం చేయకపోవచ్చు. చంద్రన్న కానుకలు లేవని అనొచ్చు కానీ, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లేవని మాత్రం ఆయనా అనలేడు. షర్మిలమ్మే తిట్లు తింటుందిలే అని చంద్రబాబు ఆ తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చి ఉండొచ్చు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీలో సీఎం జగన్ ఆరోజుతో పొలిస్తే 3వేలకు పైగా ప్రొసీజర్స్ పెంచారు. రూ.25 లక్షల వరకూ పరిమితి పెంచారు. అర్హత కోసం ఆదాయాన్ని రూ.5 లక్షలు చేశారు. 90 శాతం కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ఇవి నిజం కాదా? ఫీజు రీయింబర్స్మెంట్ ఆనాడు రూ.30 వేల నుంచి రూ. 35 వేలు ఇస్తే, ఇప్పుడు వంద శాతం చెల్లిస్తున్నది వాస్తవం కాదా? కేవలం జగన్ చెల్లెలు, వైఎస్ బిడ్డ అనే ఏకైక అర్హతతో ఇక్కడకు సోనియా గాంధీ తెచ్చి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది. రోజు రోజుకు అబద్ధాలతో షర్మిల మాటల దాడి చేస్తున్న అంశాన్ని ప్రజలు గమనించాలి. హోదా, విశాఖ స్టీల్‌పై మోదీ సభలోనే గళమెత్తిన జగన్ బీజేపీకి వైఎస్సార్సీపీ టూల్లా మారిందని, రాష్ట్రాన్ని అప్పజెప్పిందని షర్మిల చేసిన ఆరోపణలు అర్థరహితం. స్టీల్ ప్లాంట్ విషయం కేంద్రానికి సంబంధించింది. ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్‌ను నడిపేలా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం మేం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అప్పులను రీస్ట్రక్చర్ చేయడం, గనులు కేటాయించడం, అదనంగా ఉండే భూమిని అమ్మి ఆ సొమ్ముతో అప్పులను తగ్గించుకోవడం ద్వారా స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో నడిపించవచ్చని సూచిస్తూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ పరిశ్రమ వ్యాపారం కాదని, సెంటిమెంట్‌కు సంబంధించినదని కూడా చెప్పాం. ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? ప్రధాని ఉన్న వేదికపైనే ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం జగన్ గళమెత్తారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఇంకేదైనా ఉందా? పోరాటం అంటే నిర్వచనం, స్వరూపం ఎలా ఉండాలో షర్మిలే చెప్పాలి. గంగవరం పోర్టుపై షర్మిల మాటలు సత్యదూరం. ఆ పోర్టులో మనకున్న వాటా బదులుగా వచ్చిన రూ.600 కోట్లను మరో మూడు పోర్టుల అభివృద్ధికి వినియోగిస్తున్నాం. గంగవరం పోర్టుపై మన హక్కును కోల్పోలేదు. లీజు తర్వాత మళ్లీ అది ప్రభుత్వానికే వస్తుంది. ఇది కాక కొంత రెవెన్యూ షేరింగ్ కూడా ప్రభుత్వానికి వస్తుంది. ఒక పెద్ద సంస్థ వచ్చి ఆపరేషన్స్ చేస్తే రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతుంది. ప్రపంచం మొత్తం ఇలానే చేస్తోంది. ఆమె ఇచ్చింది తలా తోక ఉన్న స్టేట్మెంటేనా? మణిపూర్‌పై అప్పుడెందుకు మాట్లాడలేదు? మణిపూర్ అంశం షర్మిలమ్మ వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడెందుకు మాట్లాడలేదు? ఎందుకు పోరాడలేదు? ఇక్కడకు రాగానే బీజేపీ, మణిపూర్ అంటూ క్రిస్టియన్లకు అన్యాయం జరిగిందనడంలో ఆంతర్యం తెలియడంలేదా? ఇదంతా ఆమె అనుకున్నది కాదు... చంద్రబాబు అనుకున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఆయనకు రావాలి. అలాగే వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితుల ఓట్లు కోసం మాత్రమే ఆమెను తీసుకొచ్చారు. సంఖ్యా బలం లేకున్నా పోటీనా? శాసనసభలో సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే.. ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీకి దక్కుతాయి. సంఖ్యా బలం లేకున్నా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని దుర్మార్గమైన, వికృతమైన ఆలోచనలతో చంద్రబాబు నాటకం ఆడాలనుకుంటున్నారు. ఎన్నికలప్పుడు అభ్యర్థుల మార్పు సాధారణం. మరింత మెరుగైన ఫలితాల కోసమే మార్పులు చేస్తున్నాం. టికెట్లు దక్కని ఎమ్మెల్యేలను ఎలా ఉపయోగించుకోవాలో మేం చూసుకుంటాం. దొంగతనంగా వారిని లాక్కోవాలని చంద్రబాబు ప్రయత్నించడం ప్రజాస్వామ్యమేనా? గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారం. భావోద్వేగంతో స్పందించిన మాటలపై చిల్లర రాజకీయమా? సీఎం జగన్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. ఏదీ ఆయన హక్కు అనుకోరు. చంద్రబాబు అధికారం ఆయన హక్కు అనుకుంటాడు. చంద్రబాబు ఎప్పుడూ బాధ్యతతో అధికారంలోకి రాలేదు. అందుకే ఆయన అధికారంలోకి రాగానే.. మరో 50 ఏళ్ల తర్వాత ఏం చేస్తాడో ఇప్పుడే చెబుతుంటాడు. కానీ మన రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. ఆ స్పృహ జగన్‌కు ఉంది. ఎప్పుడైనా ప్రజలే నిర్ణేతలని గట్టిగా నమ్ముతారు. ఐదేళ్ల తర్వాత ప్రజల వద్దకు వెళ్లి దీవెనలు కోరాలని భావిస్తారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో రాజ్‌దీప్ సర్దేశాయ్ ‘మీకిది సంతృప్తినిస్తోందా’ అని అడిగితే.. దానికి భావోద్వేగంతో జగన్ స్పందించారు. నాలుగున్నరేళ్ల తన పాలనలో ఇన్ని కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించి.. ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు నింపినందుకు జన్మ ధన్యమైందని చెబుతూ.. ఒకవేళ తప్పుకోవాలన్నా పూర్తి సంతృప్తితో చేస్తాను అన్నారు. ఎవరైనా ఇలా అనగలరా? మహా స్థితప్రజ్ఞుడు మాత్రమే అనగలడు. ఇప్పటికీ 75 ఏళ్ల వయసులోనూ ఎలా ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకోవాలని అనుకునే చంద్రబాబు అయితే ఈ మాట అనలేడు. ఈ రాష్ట్రానికి ఏమి చేయగలిగాడో చెప్పుకోవడానికి జగన్‌కు చాలా ఉంది. ఆ తృప్తినే ఆయన వ్యక్తీకరించారు. దానికి ఓ చిల్లర భావాన్ని ఇచ్చి ఎల్లో మీడియా సంతోషిస్తే ఏం చేయలేం. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
మణిపూర్‌లో ఉత్కంఠ: కాంగ్రెస్ ఎమ్మెల్యే జంప్!
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చివరి వరకూ సాగిన హోరాహోరీగా పోరు ఫలితాల తర్వాత కొనసాగుతోంది. ఏ పార్టీకి ఓటర్లు మెజార్టీ ఇవ్వక పోవడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ సింగ్ బీజేపీలోకి పార్టీ ఫిరాయించారు. ఆండ్రో నియోజకవర్గం నుంచి నెగ్గిన శ్యామ్‌కుమార్‌కు ఫిరాయింపు చట్టంపై పూర్తి అవగాహన ఉందని బీజేపీ నేత హిమంతా బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతం బీజేపీకి 32 ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. మరికాసేపట్లో బీజేపీ నేతలు గవర్నర్ ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తమకుందని బీజేపీ నేత రాంమాధవ్ అన్నారు. మణిపూర్‌లో మ్యాజిక్ ఫిగర్ అయిన 31 మంది ఎమ్మెల్యేల మద్దతు తమ పార్టీకి ఉందని ప్రభుత్వాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. మొత్తం 60 నియోజవర్గాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 28 కైవసం చేసుకోగా, బీజేపీ 21 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ పార్టీ 4, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో నెగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31 మంది సీట్లు కావాలి. అయితే బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. తమకే ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను బీజేపీ కోరనున్నారు. -
కాంగ్రెస్‌కే మొగ్గు చూపిన మణిపూర్
మణిపూర్: మణిపూర్ వాసులు స్నేహ ‘హస్తం’ అందించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చివరి వరకూ సాగిన హోరాహోరీగా పోరులో బీజేపీని వెనక్కి తోసి కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల నువ్వా,నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. మొత్తం 60 నియోజవర్గాలకుగానూ ఇప్పటి వరకూ వెల్లడి అయిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 27 కైవసం చేసుకోగా, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. అలాగే బీజేపీ 21 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ పార్టీ 4, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31. మణిపూర్ లో ఓట్ల లెక్కింపు సాగుతున్న అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలు: మొత్తం బీజేపీ 19, కాంగ్రెస్ 23, ఎన్పీఎఫ్ 3, ఇతరులు 6 ఆధిక్యం: బీజేపీ 2, కాంగ్రెస్ 2, ఎన్పీఎఫ్ 1, ఇతరులు 1 ఎన్నికల లెక్కింపు సరళి: బీజేపీ 11, కాంగ్రెస్ 7, టీఎంసీ 1, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యం బీజేపీ అభ్యర్థి సాపం రంజన్ సింగ్ గెలుపు, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కొంతౌజం శరత్ సింగ్ పై 2,772 ఓట్ల తేడాతో విజయం. బీజేపీ- కాంగ్రెస్ నెక్ అండ్ నెక్ వార్: కాంగ్రెస్ 13 స్థానాల్లో, బీజేపీ 13 స్థానాల్లో ఇతరులు 8స్థానాల్లో ఆధిక్యం 10,470 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించిన ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్. కాగా ఇరోం షర్మిలకు పోలైన ఓట్ల సంఖ్య 90 కాంగ్రెస్ 11 స్థానాల్లో, బీజేపీ 9 స్థానాల్లో , ఎన్సీపీ 1, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యం కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీజేపీ 14 స్థానాల్లో ఇతరులు 8స్థానాల్లో ఆధిక్యం కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాలు, లెఫ్ట్ 1, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యం ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ అఖండ విజయం. దీంతో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఉక్కు మహిళ ఇరోం షర్మిలకు ఓటమి తప్పలేదు. మరోవైపు బీజీపీతో పోలిస్తే కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాల్లో ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యం కాంగ్రెస్ 11, బీజేపీ 12 స్థానాలు, ఎంజీపీ 2, ఇతరులు మూడు స్థానాల్లో అధిక్యం మణిపూర్ లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో, బీజేపీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ తోబల్ నియోజక వర్గంలో అధిక్యంలో కొనసాగుతున్నారు. మణిపూర్ డిప్యూటీ సీఎం గైఖంగమ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ 7స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ ఒక స్థానంలోనూ, ఇతరులు 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మణిపూర్ లో తోబల్ నియోజక వర్గంలో ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల వెనకంజ -
15 నెలల్లో అభివృద్ధి చేస్తాం
మణిపూర్ ఎన్నికల సభలో మోదీ ఇంఫాల్: పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో మణిపూర్ తీవ్రంగా వెనుకబడిందని, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని 15 నెలల్లో అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ శనివారమిక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పాలనలో మణిపూర్‌లో అభివృద్ధి కుంటుపడింది. ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు తాగునీరు అందించడంతో ప్రభుత్వం విఫలమైంది. 15 ఏళ్లలో ఆ పార్టీ చేయలేని పనిని(రాష్ట్ర అభివృద్ధి)ని మా ప్రభుత్వం 15 నెలల్లోనే చేస్తుంది’ అని చెప్పారు. ‘15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం 10 పర్సెంట్ సీఎం అని నేను విన్నాను. వంద శాతం నిజాయతీగల సీఎం కావాలా, లేకపోతే 10 శాతం కమీషన్ తీసుకునే వ్యక్తి కావాలా అన్నది ప్రజలే తేల్చుకోవాలి’ అని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం భారీగా పంపుతున్న నిధుల్లో అధిక భాగాన్ని నేతలు, అధికార పార్టీ మంత్రులు దారి మళ్లిస్తున్నారన్నారు. నాగా ఒప్పందంపై తప్పుడు ప్రచారం నాగా మిలిటెంట్లతో కేంద్రం కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై ఇబోబీ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని మోదీ మండిపడ్డారు. మణిపూర్, మణిపురీల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశమేదీ ఒప్పందలో లేదని స్పష్టం చేశారు. ‘ఏడాదిన్నర కిందట ఆ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ’ అని మండిపడ్డారు. యునైటెడ్ నాగా కౌన్సిల్(యూఎన్ త ఏడాది నవంబర్ నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరవధిక ఆర్థిక దిగ్బంధాన్ని బీజేపీ అధికారంలోకి వస్తే తొలగిస్తామని మోదీ హామీ ఇచ్చారు. నిత్యావసరాలను అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని, ప్రజలకు ఔషధాలు, ఇతర సరుకులు అందక అల్లాడతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.