
ఇప్పుడంతా మందు మరిచి పాల వైపు..
తమ రాష్ట్రంలో మద్యంపై నిషేధం విధించిన తర్వాత పాల కొనుగోలు శాతం పెరిగిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు.
గతంలో దాదాపు రూ.10వేల కోట్లు మద్యం కోసం ప్రజలు ఖర్చు చేసేవారని, ఇప్పుడు పాలు, పండ్లను కొనుగోలు చేస్తూ ఆరోగ్యం కోసం ఖర్చు చేసుకుంటున్నారని, ఇది మంచి పరిణామం అని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్యపాన నిషేధ చట్టంపై అభిప్రాయాలు తెలుసుకోవడమే నిశ్చయ యాత్ర ప్రధాన ఉద్దేశమని అన్నారు.