
సాక్షి, లక్నో : బాందా జైలులో యూపీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీకి తీవ్ర గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ముక్తార్ అన్సారీ భార్య సైతం ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజకీయవేత్తగా మారిన మాఫియాడాన్ అన్సారీని కలిసేందుకు భార్య బాందా జైలుకు వచ్చిన సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు.
గత ఏడాది ఉత్తరప్రేదశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీ ‘అన్సారీ క్వామి ఏక్తా దళ్’ను బీఎస్‌పీలో విలీనం చేశారు. మౌ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ స్ధానం నుంచి అన్సారీ రికార్డు స్ధాయిలో ఐదు సార్లు విజయం సాధించారు. పలు నేరారోపణలపై 2015 నుంచి ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు.