శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నియంత్రణలు, ఉద్రిక్తతల నడుమ నలిగిన కశ్మీర్‌లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కమ్యూనికేషన్స్ వ్యవస్థపై ఇప్పటివరకూ ఆంక్షలు విధించగా గురువారం 5 జమ్ము జిల్లాల్లో మొబైల్ సేవలను పునరుద్ధరించారు. స్కూళ్లు, కాలేజీలు సహా విద్యాసంస్ధలు తెరుచుకున్నా విద్యార్ధుల హాజరు సంఖ్య పరిమితంగా ఉంది. మరోవైపు సుప్రీం కోర్టు అనుమతించడంతో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శ్రీనగర్‌ను సందర్శించనున్నారు. ఏచూరి తన పర్యటనలో భాగంగా తమ పార్టీ ఎమ్మెల్యే యూసఫ్ తరిగామితో భేటీ కానున్నారు. కాగా, జమ్ము కశ్మీర్‌కు ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రుల బృందాన్ని (జీఓఎం) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జీఓఎంలో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, తవర్ చంద్ గెహ్లోత్, జితేందర్ సింగ్, నరేంద్ తోమర్, దర్మేంద్ర ప్రధాన్‌లు సభ్యులుగా ఉన్నారు. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్ సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జీఓఎం రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment