'మోదీ తల్లి క్షేమంగా ఉన్నారు' | Modi's mother taken to hospital, is fine: Family | Sakshi
Sakshi News home page

'మోదీ తల్లి క్షేమంగా ఉన్నారు'

Published Thu, Feb 25 2016 6:53 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Modi's mother taken to hospital, is fine: Family

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హిరాబెన్ మోదీ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను గాంధీ నగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, తిరిగి ఇంటికి తీసుకొచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం పంకజ్ మోదీతో ఉంటున్న హిరాబెన్ సాధారణంగా ప్రతి రోజూ వైద్య పరీక్షలకు వెళ్లొస్తుంటారు.

కానీ, బుధవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఆమె కొంత ఎక్కువగా అస్వస్థతకు లోనవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 'ఆమె ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. ఇంటికి పంపించాం. ఇవి వయోభారం వచ్చే సమస్యలు మాత్రమే. కొంత దగ్గు, శ్వాస సంబంధమైన సమస్యతో ఆమె బాధపడుతున్నారు' అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement