వీరప్ప మొయిలీ
బెంగళూరు: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. తమ పార్టీలో అభ్యర్థుల ఎంపికలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ శుక్రవారం చేసిన ఓ ట్వీట్‌తో వివాదం చెలరేగింది. ‘రాజకీయాల్లో డబ్బు సమస్యను కాంగ్రెస్ పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
ప్రజా పనుల విభాగం మంత్రి (మహదేవప్ప)తో కాంట్రాక్టర్లకున్న సంబంధాలను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసే పరిస్థితి సరైంది కాదు’ అని మొయిలీ ఖాతా నుంచి వచ్చిన ఓ ట్వీట్ పేర్కొంది. అయితే ఇది ధ్రువీకృత ఖాతా కాదు. ‘ఆ ట్వీట్‌ను నేను చేయలేదు. అది వేరెవరో చేసిన తప్పు. ఆ ట్వీటర్ ఖాతా నా నియంత్రణలో లేదు’ అని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొయిలీ కుమారుడు హర్షకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకూడదంటూ ఆ రాష్ట్ర ప్రజా పనుల విభాగం మంత్రి మహదేవప్ప ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment