
యశ్వంతపుర: మాతృమూర్తియే కూతురి పాలిట మృత్యువు అయింది. తన నాలుగేళ్ల చిన్నారిని గొంతు నులిమి అనంతరం ఆత్మహత్యకు పాల్పడిందో తల్లి. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం కోణనకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివి.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్ గుప్త, శీలు దంపతులు. పొట్టకూటి కోసం బెంగళూరు వలస వచ్చి చుంచనకట్టెలో నివాసం ఉంటున్నారు.
వీరికి అంశిక అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. సంజయ్‌గుప్త చుంచనకట్టె యలమ్మదేవి ఆలయం సమీపంలో పానీపూరి వ్యాపారం చేస్తున్నాడు. శీలు ఇటివల పుట్టింటికి వెళ్లి నాలుగు రోజుల క్రితం కూతురు అంశికను తీసుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం భర్త అంగడిలో ఉండగా శీలు ఇంట్లో కుమార్తె గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న సంజయ్‌గుప్త జరిగిన ఘోరాన్ని చూసి హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాధానం ఇచ్చాడు. వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కుమార్తెను చంపి తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment