
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత దివంగత కరుణానిధి ఒకప్పుడు మాంసాహారి. అయితే, ఒకే ఒక్క ఘటన ఆయన్ను పూర్తి శాకాహారిగా మార్చి వేసింది. శాకాహారిగా మారడం వెనుక ఉన్న నేపథ్యాన్ని డీఎంకే ఎంపీ, ఆయన కూతురు కనిమొళి శనివారం మీడియాతో చెప్పారు. ‘కరుణానిధి మాంసాహారి. ఆయన ఇంట్లో ఉన్నంతసేపూ నల్ల రంగు పెంపుడు కుక్క వెన్నంటే ఉండేది. తాను తినే ప్రతీదాన్ని ఆ కుక్కకు ఆయన పెట్టేవారు. అయితే, తనకు ఎంతో ఇష్టమైన ఆ కుక్క మరణంతో కరుణానిధి మారిపోయారు. మాంసాహారాన్ని మానేసి పూర్తి శాకాహారి అయ్యారు. ఆ కుక్క కళేబరాన్ని మా ఇంటి వెనుక ఖాళీ స్థలంలో పూడ్చి పెట్టి, ఓ మొక్క నాటారు. ఆనాటి మొక్క నేడు పెద్ద చెట్టుగా ఎదిగింది’ అని కనిమొళి గతాన్ని గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment