'అంబానీల కేజీ బేసిన్ కుంభకోణం భోఫోర్స్ కంటే పెద్దది'
'అంబానీల కేజీ బేసిన్ కుంభకోణం భోఫోర్స్ కంటే పెద్దది'
Published Tue, Feb 18 2014 9:11 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రిలయన్స్ గ్యాస్ కు సంబంధించిన అంశంలో ముఖేశ్ అంబానీపై ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై బీజేపీ, మోడీ ఎందుకు మౌనంగా ఉందో వెల్లడించాలని ఆప్ నిలదీసింది. క్విడ్ ప్రో కో లేకుండా కార్పోరెట్ కంపెనీల నుంచి ఫండ్స్ ను స్వీకరించడం తప్పేమి కాదని ఆప్ వెల్లడించింది.
అంబానీలకు కేజీ బేసిన్ కుంభకోణం దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అని, భోఫోర్స్ కుంభకోణానికంటే అతిపెద్దదని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. ఇలాంటి కుంభకోణంపై బీజేపీ, మోడీ మౌనం వహించడం అనేక సందేహాలకు తావిస్తోంది అని యాదవ్ అన్నారు.
ముఖేశ్ అంబానీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా మా పోల్ ఎజెండా ఏమిటో కాంగ్రెస్, బీజేపీలకు అర్ధమైందన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కీలక కూటమిలలో కాంగ్రెస్, బీజేపీ, థర్డ్ ఫ్రంట్ కు ఆప్ ప్రత్యామ్నాయం కాదని యాదవ్ స్పష్టం చేశారు. అంబానీల నుంచి విరాళాలు స్వీకరిస్తారా అనే ప్రశ్నకు యాదవ్ సమాధానమిస్తూ... విరాళాలు స్వీకరించడమనే అంశంపై ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
Advertisement
Advertisement