
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఏప్రిల్ 20 తర్వాత కరోనా హాట్‌స్పాట్‌లు కానీ ప్రాంతాలతో షరతులతో కూడిన సడలింపు ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను రేపు విడుదల చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 20 వరకు మాత్రం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ కాలంలో ఏడు సూత్రాలు పాటించాల్సిందిగా ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వీటిని కచ్చితంగా అమలు చేస్తే కరోనాపై విజయం సాధించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రతి ఒక్కరు లాక్‌డౌన్ నిబంధనలు విధిగా పాటించాలని కోరారు.
చదవండి : మే 3 వరకు లాక్‌డౌన్ : మోదీ