మోడీ ఫెయిల్, రంగంలోకి దిగిన సుష్మ | Narendra Modi fails to convince Advani, Sushma swaraj's turn to try | Sakshi
Sakshi News home page

మోడీ ఫెయిల్, రంగంలోకి దిగిన సుష్మ

Published Thu, Mar 20 2014 10:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

మోడీ ఫెయిల్, రంగంలోకి దిగిన సుష్మ - Sakshi

మోడీ ఫెయిల్, రంగంలోకి దిగిన సుష్మ

న్యూఢిల్లీ : గాంధీనగర్ టికెట్ కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్న బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కె అద్వానీని బుజ్జగించేందుకు ఆపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అద్వానీ మాత్రం భోపాల్ స్థానం నుంచే బరిలో దిగుతానని పట్టుతో ఉన్నట్లు సమాచారం. టికెట్ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం ఉదయం అద్వానీకి కలిసి గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని కోరారు. అయితే అందుకు అద్వానీ ససేమిరా అన్నట్లు సమాచారం. దాంతో ఆ పార్టీ నేతలు సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు. అగ్రనేతను బుజ్జగించే పనిలో పడ్డారు. మరి అద్వానీ పట్టువీడతారాల లేదా....అనేది తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement