న్యూఢిల్లీ: దేశంలో మాదక ద్రవ్యాల బెడదను పరిష్కరించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ దిశగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఆయన ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని దాన్నుంచి బయట పడేసే దిశగా చేసిన పోరాటంలో వారు ఎదుర్కొన్న అనుభవాలను తనతో పంచుకోవాలని కోరారు. తన తదుపరి ఆకాశవాణి ప్రసంగంలో మాదక ద్రవ్యాల బానిసత్వంపై ప్రసంగించనున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ఆదివారం ప్రసారమైన తన ఆకాశవాణి కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఈ అంశాన్ని సృ్పజించడాన్ని ఆయనీ సందర్భంగా తెలిపారు.
మాదక ద్రవ్యాల బెడద గురించి అనేకమంది స్నేహితులు తనకు లేఖరాసిన విషయాన్ని చెబుతూ.. తదుపరి కార్యక్రమంలో ఇదే అంశాన్ని తీసుకుంటానని పేర్కొన్న విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. ‘‘ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడంలో మీ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నా. మీరు కనుక ఈ దిశగా పనిచేస్తున్నట్లయితే.. దయచేసి మీ అనుభవాలను నాతో పంచుకోండి’’ అని ఆయన తన ట్వీట్ ద్వారా ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను కోరారు. ఝడజౌఠి వెబ్‌సైట్ ద్వారా వీటిని తెలియజేయాలని తెలిపారు. ఎవరైనా ఈ విషయంలో వ్యక్తిగత అనుభవాలను బహిరంగంగా పంచుకోవడానికి ఇష్టపడని పక్షంలో తనకు నేరుగా లేఖ రాయవచ్చని ప్రధాని సూచించారు. తన తదుపరి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ అంశంపై ప్రసంగిస్తానని హామీనిచ్చారు. దాదాపు నెలరోజుల తరువాత ఇది ప్రసారమవుతుందని భావిస్తున్నారు.
డ్రగ్స్ నిర్మూలనపై సలహాలివ్వండి
Published Wed, Nov 5 2014 1:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement