
'ముంబై పేలుళ్లపై విచారణ వేగవంతం చేయండి'
న్యూడిల్లీ: 2008 ముంబై పేలుళ్లకు సూత్రధారులైన పాకిస్థానీ ఉగ్రవాదులపై విచారణను వేగవంతం చేయాలని ఆదేశ ప్రధాని నవాజ్ షరీఫ్ దృష్టికి భారత ప్రధాని నరేంద్రమోడీ తీసుకువచ్చారు.
నవాజ్ షరీఫ్, మోడీల మధ్య జరిగిన సమావేశంలో పెరుగుతున్న ఉగ్రవాదంపై భారత ప్రధాని ఆందోళన వ్యక్తం చేసినట్టు విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్ మీడియాకు వెల్లడించారు.
భారత దేశానికి వ్యతిరేకంగా నడుపుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని షరీఫ్ కు మోడీ సూచించారు.