
రాజధాని భూములపై ఆరోపణలు సహజమే
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి ప్రాంత భూములపై ఆరోపణలు సహజమేనని కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూముల పేర్ల మార్పులు, బదలాయింపులు న్యాయపరంగా చెల్లవని బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
రైతులు వారి భూములను పూలింగ్ కింద ఇచ్చారని, అది కొందరికి ఇష్టం లేక ఆరోపణలు చేస్తున్నార ని చెప్పుకొచ్చారు. అసైన్డ్ భూములను టీడీపీ నాయకులు స్వంత పేర్లపై రాయించుకుంటే న్యాయ పరంగా చెల్లదన్నారు. భోగాపురంలో విమానాశ్రయానికి సూత్రప్రాయ అనుమతులు లభించాయని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి ఉందని తెలిపారు.