భారత్ జనాభా 123 కోట్లు! | ndia’s population at 123 crore as of March 2012: Rajeev Shukla | Sakshi
Sakshi News home page

భారత్ జనాభా 123 కోట్లు!

Published Fri, Aug 30 2013 1:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

ndia’s population at 123 crore as of March 2012: Rajeev Shukla

న్యూఢిల్లీ: భారతదేశ జనాభా 2012, మార్చి 1 నాటికి 123 కోట్లకు చేరింది. ఇక 2011-12లో దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 27 కోట్లు. ఈ వివరాలను కేంద్ర ప్రణాళిక శాఖ సహాయమంత్రి రాజీవ్ శుక్లా గురువారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 2011, మార్చి 1 నాటికి దేశ జనాభా 121 కోట్లుగా ఉన్నట్టు ఆయన తెలిపారు.

 

2004-05తో పోలిస్తే దేశంలో పేదరికం రేటు 2011-12 నాటికి 37.2 శాతం నుంచి 21.9 శాతానికి తగ్గిందని మంత్రి వివరించారు. 1993-94 నుంచి 2004-05 మధ్యకాలంతో పోలిస్తే 2004-05 నుంచి 2011-12 మధ్యకాలంలో మూడు రెట్లు వేగంగా పేదరికం రేటులో తగ్గుదల నమోదైనట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement