నీతా అంబానీకి అరుదైన గౌరవం
Published Fri, Jun 3 2016 6:51 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్ర్రీస్ అధినేత ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్ గా ఏకగ్రీవంగా నామినేట్ అవనున్నారు. ఈమేరకు స్విడ్జర్లాండ్ లోని ప్రధాన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. నీతా ఎన్నికను ఆగష్టు 2 లేదా 4వ తేదీన రియో డిజినరీలో ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. ఆమె 70 ఏళ్ల వయసు వరకు నామినేటేడ్ మెంబర్ గా కొనసాగుతారు.
భారతదేశం నుంచి ఎన్నికయిన మొదటి మహిళగా నీతా అంబానీ నిలువనున్నారు. విద్య, క్రీడల్లో ఆమె చేస్తున్న కృషికి గాను ముఖ్యంగా ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ క్రీడలకు అందిస్తున్న సేవలకు గాను ఆమెకు ఈ గౌరవం దక్కింది. దీనిని గొప్ప గౌరంవంగా భావిస్తున్నానని, క్రీడల అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని నీతా అంబానీ తెలిపారు.
Advertisement