భారత్ను ఎవరూ హెచ్చరించలేరు: రాజ్నాథ్ సింగ్
భారతదేశానికి ఎవరూ హెచ్చరికలు చేయలేరని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో సరిహద్దు వద్ద భారతదేశం రోడ్డు వేస్తుండగా దానికి చైనా అభ్యంతరం చెప్పడంపై ఆయన స్పందించారు. భారత్ చాలా శక్తిమంతమైన దేశమని, మనను ఎవరూ హెచ్చరించలేరని ఆయన అన్నారు.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) 30వ రైజింగ్ డే సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్యలను చైనా, భారత్ రెండు దేశాలూ కలిసి చర్చించుకోవాలని ఆయన చెప్పారు. సరిహద్దుల్లో భారతదేశం ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయకూడదని, దానివల్ల సరిహద్దు సమస్య మరింత సమస్యాత్మకం అవుతుందని రాజ్నాథ్ అన్నారు.