
నోయిడాలో ఆరుగురు మాయిస్టుల అరెస్ట్
నోయిడాలో ఆరుగురు మాయిస్టుల అరెస్ట్
నోయిడా : ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అధికారులు గతరాత్రి ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. హిందాన్ విహార్‌లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందటంతో ఏటీఎస్ అధికారులు మెరుపు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఆరు పిస్టోల్స్, 50 కార్టిడ్జ్స్, మూడు కార్లు, 125 డిటోనేటర్లు, 2 ల్యాప్‌టాప్‌లను ఉన్నాయి.
అరెస్ట్ అయిన మావోయిస్టులు బాంబుల తయారీలో నిపుణులని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ - ఎన్‌సీఆర్ పరిధిలో దాడులకు పాల్పడేందుకు వారు కుట్ర చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. అరెస్ట్ అయినవారిలో పీడబ్ల్యూజీ కమాండర్ ప్రదీప్ కుమార్ సింగ్ ఉన్నట్లు సమాచారం. ఇతడు 2012 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. కాగా అరెస్ట్లను ఏటీఎస్ ఐజీ అసీమ్ అరుణ్ ధ్రువీకరించారు. విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.