మేం వకాల్తా పుచ్చుకోం...
కోల్కతా: కోల్కతా నన్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుని తరపున వాదించబోమని స్థానిక బార్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. 70 యేళ్ల క్రైస్తవ సన్యాసినిపై కిరాతకంగా దాడిచేసి దుశ్చర్యకు పాల్పడిన ఘటనకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ మిలన్ సర్కార్ తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు సలీంను సీఐడి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈకేసులో సీసీఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడు అరెస్ట్ చేసినప్పటికీ... మిగతా వారు ఇంకా పరారీలోనే ఉన్నారు. కాగా సబ్- డివిజనల్ లీగల్ ఎయిడ్ కమిటీ నిందితుడికి న్యాయ సహకారం అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి వాసుదేవ్ ముఖోపాధ్యాయ నియమితులైనట్లు సమాచారం.