
స్మృతి ఇరానీ ఆసక్తికర విషయాలు
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
న్యూఢిల్లీ: కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మొదట తాను జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఉద్యోగం చేయాలని కోరుకున్నట్టు చెప్పారు. అయితే మంచి శరీరదారుఢ్యం లేదన్న కారణంతో తనకు ఉద్యోగం ఇచ్చేందుకు జెట్ ఎయిర్వేస్ నిరాకరించిందని చెప్పారు. ఉద్యోగం వచ్చివుంటే తాను కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు.
అప్పుడు తనకు ఉద్యోగం రానందుకు ఇప్పుడు దేవుడికి ధన్యవాదాలు తెల్పుకుంటున్నానని చెప్పారు. జెట్ ఎయిర్వేస్ లో ఉద్యోగం రాకపోవడంతో మెక్డొనాల్డ్ సంస్థలో చేరారని, తర్వాత చరిత్ర మీ అందరికీ తెలుసునని స్మృతి ఇరానీ అన్నారు. టీవీ నటిగా పేరు సంపాదించిన ఆమె తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కేంద్రమంత్రి అయిన సంగతి తెలిసిందే.