స్కూల్‌లో కాషాయ జెండా ఎగరేశారు..!
Published Thu, Mar 23 2017 6:12 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
అరారియా(బిహార్): ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అత్యధిక స్థానాలలో విజయం సాధించడంతో బీహార్‌లోని అరారియా జిల్లా ఫోర్బ్‌స్‌గంజ్ పాఠశాలలో మార్చి 18వ తేదీన కొందరు బీజేపీ నాయకులు పార్టీ జెండా ఎగురవేశారు. ఈ ఘటనపై బిహార్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిందన్న ఆనందంలో సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగిందని ప్రధానోపాధ్యాయుడు జగ్దీష్ మెహతా తెలిపారు.
పాఠశాల వేళలు ముగిసిన అనంతరం తామంతా ఇళ్లకు వెళ్లితుండగా కొందరు అక్కడికి చేరుకున్నారని, అడ్డుకున్నప్పటికీ వినకుండా పాఠశాలలో కాషాయ జెండా ఎగురవేశారని హెచ్‌ఎం తెలిపారని, డీఈవో ఫైజుల్ రహ్మాన్ తెలిపారు. ఈ ఘటనపై తాము బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(బీఈవో)ను విచారణ చేపట్టాలని ఆదేశించామని, నివేదిక అందాక బాధ్యులపై చర్యలు చేపడతామని చెప్పారు. ఈ అంశం విద్యాశాఖకు సంబంధించినది కాబట్టి తాము జోక్యం చేసుకోలేదని.. ఫిర్యాదు అందితే విచారణ చేపడతామని సబ్‌డివిజినల్ పోలీస్ ఆఫీసర్ అజిత్ సింగ్ చెప్పారు.
Advertisement
Advertisement