ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. 35,000 ప్రాంతీయ పంచాయతీ వార్డులకు జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ప్రముఖులు ఓటమి చెందారు. అత్యధిక స్థానాల్లో మంత్రులకు సంబంధించిన అభ్యర్ధులు ఓటమి చెందారు.
ఫలితాలపై భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బహదూర్ పాఠక్ మాట్లాడుతూ.. 'ఎన్నికల ఫలితాలు ప్రజల్లో సమాజ్ వాదీ పార్టీకి గల వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి, అవినీతి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని నిశ్చయించుకున్నారు' అని తెలిపారు