
సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి పార్లమెంట్ ఘనంగా నివాళులర్పించింది. పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో సభ్యులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. రాజ్యసభ సైతం గురువారానికి వాయిదా వేశారు. కాగా మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరుణానిధి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం చెన్నైలోని మెరీనా బీచ్‌లో నిర్వహించనున్నారు. కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతిస్తూ బుధవారం ఉదయం తీర్పునిచ్చింది.