జమ్మూ కశ్మీర్‌లో ప్రత్యేకించి కశ్మీర్ లోయలో ఓట్ల చీలికకు అధికార నేషనల్ కాన్ఫరెన్స్ కుట్ర పన్నుతోందని ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ప్రత్యేకించి కశ్మీర్ లోయలో ఓట్ల చీలికకు అధికార నేషనల్ కాన్ఫరెన్స్ కుట్ర పన్నుతోందని ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ప్రాంతీయవాద వ్యక్తిత్వాన్ని కోల్పోయిన ఎన్‌సీ...స్వార్థ శక్తుల చేతిలో రాష్ట్రంలో ఓట్లను చీల్చే స్థాయికి దిగజారిందని ఆమె దుయ్యబట్టారు. మంగళవారం బందిపొరా, సోనావరీలలో నిర్వహించిన ప్రచార సభల్లో ఆమె పాల్గొన్నారు. ఎన్‌సీ గత కొన్నేళ్లుగా అధికార సాధన కోసం విలువలపై రాజీ పడిందన్నారు.
ప్రజలు ఎన్నోసార్లు అధికారం అప్పగించినా వారి ఆకాంక్షలను అనుగుణంగా పనిచేసే బదులు ప్రజలను అధికారంలోకి తెచ్చిపెట్టే బానిసలుగా మాత్రమే చూసిందని ముఫ్తీ దుయ్యబట్టారు.