న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం ఉదయం పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి ప్రణాళికపై చర్చించినట్లు సమాచారం. కాగా భేటీ అనంతరం కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ)ను బహిర్గతం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం కొలువు దీరనుంది. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు పీడీపీ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మార్చి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రానికి సయీద్ ఆరేళ్లపాటు సీఎంగా కొనసాగుతారని, బీజేపీ నేత నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం.