కోల్‌కతా : కరోనా ప్రభావం దేవాలయాలపైనా పడింది. లాక్‌డౌన్ వల్ల సుమారు రెండు నెలలుగా దేవాలయాలన్నీ మూత పడ్డాయి. అయితే, మే 31న లాక్‌డౌన్ లాక్‌డౌన్ 4.O పూర్తవుతుండగా జూన్ 1 నుంచి దేవాలయాలు సహా అన్ని రకాల ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1 నుంచి ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు సహా అన్నిరకాల ప్రార్థనా మందిరాలు పున:ప‌్రారంభం అవుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కానీ, వీటిలో 10 మందికన్నా ఎక్కువ ప్రవేశించేందుకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. (పుణ్యక్షేత్రాలకు కరోనా ఎఫెక్టు)
తేయాకు, జనపనార పరిశ్రమలు కూడా పూర్తి స్థాయి సిబ్బందితో నడుపుకోవచ్చని ఆమె వెల్లడించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా పూర్తిస్థాయిలో పనిచేసుకోవచ్చన్నారు. సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ఆన్‌లైన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా కరోనా వ్యాప్తిని నిరోధించడంలో పశ్చిమ బెంగాల్ విజయం సాధించిందని ప్రకటించారు. ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కేసులన్నీ బయట నుంచి వచ్చినవారివేనని ఆమె స్పష్టం చేశారు. కాగా, లాక్‌డౌన్ 4.O ముగిసిన తర్వాతి రోజు నుంచే ఆలయాలను తెరుస్తున్నట్లు కర్ణాటక రాష్ట్రం ప్రకటించిన విషయం తెలిసిందే. (‘అమిత్ షా.. మీరే రంగంలోకి దిగొచ్చుగా?’)
Comments
Please login to add a commentAdd a comment