
అంగ్‌సాన్ సూచీకి మోదీ శుభాకాంక్షలు
మయన్మార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అంగ్‌సాన్ సూచీకి భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. యూకే పర్యటనకు వెళుతున్న సమయంలో అంగ్‌సాన్ సూచీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి, భారత్ రావాలని ఆహ్వానించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ట్విట్ చేశారు.
మయన్మార్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల పార్టీ 'నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్‌ఎల్‌డీ)' ఘన విజయం సాధించింన విషయం తెలిసిందే. గత ఆదివారం జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్న మయన్మార్ ప్రజలు.. ఎన్‌ఎల్‌డీకి తిరగులేని మెజారిటీ అందించారు. ఈ ఎన్నికల్లో ఎన్ఎల్డీ 536 పార్లమెంట్ సీట్లను గెలుపొందింది.
Diplomacy aboard Air India 1! PM called Daw Aung San Suu Kyi, congratulated her on her electoral victory and invited her to visit India
— Vikas Swarup (@MEAIndia) November 12, 2015