PM Modi Congratulates To Britain New PM Liz Truss - Sakshi
Sakshi News home page

PM Modi: బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్‌కు మోదీ శుభాకాంక్షలు

Published Tue, Sep 6 2022 11:42 AM | Last Updated on Tue, Sep 6 2022 11:54 AM

PM Modi Congratulates Britain New Pm Liz Truss - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆమె నాయకత్వంలో భారత్-బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని  ఆకాంక్షించారు. ప్రధానిగా కొత్త బాధ్యతలు చేపడుతున్న ఆమెకు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఈమేరకు మోదీ ట్వీట్ చేశారు.

బ్రిటన్ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాన్‌పై లిజ్ ట్రస్ ఘన విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులంతా ఆమెవైపే మొగ్గుచూపారు. ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా.. రిషికి 60,399 ఓట్లు వచ్చాయి. అధికారిక ఫలితాలను సోమవారం సాయంత్రం ప్రకటించారు. ప్రధానిగా ట్రస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చదవండి: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి.. సీఎం సంతాపం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement