సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాసియాలోని తొలి క్రాస్‌బోర్డర్ పెట్రోలియం పైప్‌లైన్ భారత్, నేపాల్ మధ్య ప్రారంభమైంది. బిహార్‌లోని మోతీహరి- నేపాల్‌లోని అమ్‌లేక్‌గంజ్ మధ్య నిర్మించిన ఈ పెట్రో పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతోపాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 69 కిలోమీటర్ల ఈ పైప్‌లైన్ కోసం కేంద్రం రూ. 350 కోట్లు వెచ్చించింది. కేవలం 15 నెలల రికార్డ్ సమయంలో ప్రాజెక్ట్ పూర్తికావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. నేపాల్ ప్రభుత్వ సహకారం, ఇరుదేశాల అధికారుల సమర్థత కారణంగానే ఇది సాధ్యమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment