రామేశ్వరం : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బయలుదేరిన ఆయన ప్రస్తుతం తమిళనాడులోని రామేశ్వరం చేరుకున్నారు. సొంతగడ్డపై ఈ రోజు ఉదయం కలాం అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. కలాం అంతిమయాత్రకు మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆయనను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు రామేశ్వరానికి తరలివచ్చారు.