ఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వర్థంతి కార్యక్రమాన్ని ఆదివారం ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు నివాళులర్పించారు.
సమానత్వం, సామాజిక ఐకమత్యానికి బాబా సాహెబ్ దూత అని, బడుగు బలహీన వర్గాల వారికి ఆశా జ్యోతిలా నిలిచారని ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా ఆయన సేవలను కొనియాడారు.
Paid homage to Dr. Ambedkar. pic.twitter.com/kT3IPND3Tt
— Narendra Modi (@narendramodi) December 6, 2015