తెలంగాణకు మరో రెండు వరాలు! | principle approval given for NIMZ in Telangana:Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మరో రెండు వరాలు!

Published Thu, Jan 21 2016 8:46 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

తెలంగాణకు మరో రెండు వరాలు! - Sakshi

తెలంగాణకు మరో రెండు వరాలు!

న్యూఢిల్లీ: తెలంగాణలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి జోన్ (నిమ్జ్)ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ జోన్ లను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చినట్లు ఆమె గురువారం తెలిపారు. దీంతో ప్రత్యక్షంగా 75వేల మంది, పరోక్షంగా 1.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ ట్విట్ చేశారు. 

 

ఈ జోన్లు ముఖ్యంగా ఔషద పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించేలా ఉంటాయని పేర్కొన్నారు. 2011లో రూపొందించిన పారిశ్రామిక విధానం ఆధారంగా దేశవ్యాప్తంగా ఈ తరహా జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా మెదక్ జిల్లా జరాసంగం మండలం న్యాల్‌కల్‌ లో ఏర్పాటు చేయనున్న నిమ్జ్కు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement