
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో హింసాత్మక నిరసనలు కొనసాగాయి.
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. జఫ్రాబాద్ ప్రాంతంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. విద్యార్ధుల నిరసన ప్రదర్శన నేపథ్యంలో సీలంపూర్ నుంచి జఫ్రాబాద్ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు వెల్‌కం, జఫ్రాబాద్, మౌజ్‌పూర్-బబర్పూర్ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేశారు.