చెన్నై యూనిర్సిటీలోని ఆరోగ్య విభాగం డీన్ రాము మణివణ్ణన్ అధ్యక్షతన సుమారు పది మంది విద్యార్థులు వేలూరు కన్నియంబాడిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వనమూలికల తోటను పరిశీలించి వాటి ఉపయోగాలపై పరిశోధన చేసేందుకు మొక్కలు తీసుకెళ్లారు. వీరిలో ఇన్‌ఫోకాఫ్స్ డైరెక్టర్ అర్జున్, డాక్టర్ రిషి ఉన్నారు.
చెన్నై , టీ.నగర్: 5, 8వ తరగతులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు చట్ట సవరణను కేంద్ర గెజిట్‌లో విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఉచిత, నిర్బంధ విద్యా చట్టంలో మార్పులు చేసి, ఐదు, ఎనిమిదో తరగతులకు పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన చట్ట సవరణను ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ సవరణ చట్టం ప్రస్తుతం ప్రభుత్వ గెజిట్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అందరు విద్యార్థులు కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.
దీంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నట్లు, ఐదో తరగతి, ఎనిమిదో తరగతులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలంటూ, కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తెలుపుతూ వచ్చింది. దీని గురించిన ప్రకటనను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విడుదలచేశారు. అయినప్పటికీ ఈ పద్ధతి ద్వారా గ్రామీణ విద్యార్థుల విద్యకు ఆటంకం ఏర్పడుతుందని, అనేక మంది పిల్లలు విద్యను అర్ధాంతరంగా మానేసే పరిస్థితులు ఏర్పడతాయని, కొన్ని రాష్ట్రాలు అభిప్రాయం వెలిబుచ్చాయి. అదే సమయంలో ఉచిత, నిర్బంధ విద్య అమల్లో ఉన్న తమిళనాడు ఈ కొత్త మార్పును చేపట్టరాదంటూ ఎనిమిది తరగతి వరకు ఉచిత విద్యను అందించాలని తెలిపింది.
అయినప్పటికీ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎనిమిదో తరగతి వరకు కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయన్నారు. దీంతో ఎనిమిదో తరగతికి పబ్లిక్ పరీక్షను తప్పనిసరి చేయాలని తెలిపారు. ఈ వ్యవహారంపై గత 11వ తేదీన కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ఈ సమాచారం విడుదలైంది. అందులో ఐదు, ఎనిమిది తరగతులకు సంవత్సరాంతంలో కచ్చితంగా పరీక్ష నిర్వహించాలని, ఇందులో ఫెయిల్ అయిన వారికి మళ్లీ అవకాశం కల్పించే విధంగా ఫలితాలు వెల్లడైన రెండు నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment