ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో మూడు రోజులు పర్యటించనున్న నేపథ్యంలో ఆపార్టీ చిక్కుల్లో పడింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న విజయ్ కుమార్ తాను నరేష్ యాదవ్ ప్రోద్బలంతోనే మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించానని, ఇందుకు తనకు ఎమ్మెల్యే కోటి రూపాయలు ఇస్తానన్నారని పోలీసులకు తెలిపాడు. నరేష్ యాదవ్ ఢిల్లీలోని దక్షిణ మొహ్రాలీ నుంచి ఆప్ ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. గత నెల జూన్ 24 న పంజాబ్ లోని మాలెర్ కొట్లా ప్రాంతంలో ఖురాన్ ప్రతులను డంప్ లో పడేయంతో ఆ ప్రాంతంలో మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.