కాంగ్రెస్ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంథీ శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని అమేథీ ప్రాంతంలో పర్యటించారు.
అమేథీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంథీ శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని అమేథీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో ఆయన ముచ్చటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగాయని, కేజీ పప్పు ధర రూ. 200 లకు చేరిందని ఆయన విమర్శిచారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆయన యూపీఏ ప్రభుత్వ పాలనను సమర్థించుకున్నారు.