మోదీకి అజ్ఞానం పోవాలి | Rahul Gandhis Om Shanti tweet takes a dig at PM Modis BJP facing adversity remark | Sakshi
Sakshi News home page

మోదీకి అజ్ఞానం పోవాలి

Published Sat, Aug 20 2016 1:26 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

మోదీకి అజ్ఞానం పోవాలి - Sakshi

మోదీకి అజ్ఞానం పోవాలి

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీని టార్గెట్ చేశారు. ప్రధాని మోదీకి అజ్ఞానం నుంచి స్వేచ్ఛ లభించాలని తాను దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు శుక్రవారం ట్వీటర్‌లో ఎద్దేవా చేశారు. బ్రిటిష్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కంటే.. స్వతంత్ర భారత దేశంలో బీజేపీ ఎక్కువ కష్టాలను ఎదుర్కొందని బీజేపీ నూతన ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ గురువారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

‘‘మోదీ మీ కోసం ప్రార్థిస్తున్నాను: అసతోమా సద్గమయ.. తమసోమా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయ.. ఓం శాంతి శాంతి శాంతి.. అజ్ఞానం నుంచి సత్యంవైపు.. చీకటి నుంచి వెలుగువైపు.. మృత్యువు నుంచి అమరత్వంవైపు.. నడిపించాలని, సమస్త జీవరాశికీ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని రెండు ట్వీట్స్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement