తెల్లగా ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటుందని, విజయాలు సాధిస్తారని చెప్పే వాణిజ్య ప్రకటనలు చాలానే చూశాం. కానీ ఇప్పుడు అలా చెప్పడానికి ప్రకటనలు అక్కర్లేదు తామున్నామంటూ రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ముందుకొచ్చింది. ఈ బోర్డు ఇటీవల ముద్రించిన కొన్ని పాఠ్య పుస్తకాలలో దీనికి సంబంధించిన అంశాలున్నాయి. మంచి ఎత్తు, అందమైన రంగు ఉన్నవాళ్లే వ్యాపారంలో రాణిస్తారని ఆ పుస్తకాల్లో రాశారు. మంచి ఆరోగ్యం, మౌనంగా ఉండటం, ప్రభావశీలమైన వ్యక్తిత్వం, మంచి ఎత్తు, మంచి రంగు, గంభీరత లాంటి భౌతిక అంశాలు కూడా మంచి వ్యాపార లక్షణాలని వివరించారు. సమాజానికి ఉపయోగపడే లక్షణాల పేరుతో ముద్రించిన ఈ పుస్తకాల్లో కేంద్రంలోను, రాష్ట్రంలోను ఉన్న బీజేపీ ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల గురించి కూడా వివరించారు.
9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగు పాఠ్యపుస్తకాల్లో స్వచ్ఛభారత్ అభియాన్, పీఎం కౌశల్ వికాస్ యోజన, గల్ స్వావలంబన్ యోజన, భమాషా యోజనల గురించి ఒక్కో అధ్యాయం ప్రచురించారు. మొదటి రెండు మోదీ ప్రభుత్వం పథకాలు కాగా మిగిలిన రెండు వసుంధర రాజే ప్రభుత్వం ప్రవేశపెట్టినవి. ఇటీవల ఇలాగే 12వ తరగతికి సంబంధించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ పుస్తకంలో 36-24-36 కొలతలు మహిళలకు మంచి శరీరాకృతిని సూచిస్తాయని తెలిపారు.
తెల్లగా ఉంటేనే వ్యాపారంలో రాణిస్తారట!
Published Tue, Apr 18 2017 4:10 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
Advertisement