
దీర్ఘదృష్టితో రూపొందిన బడ్జెట్ : రాజ్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ దీర్ఘకాలంలో దేశ ముఖచిత్రాన్ని మార్చివేసేందుకు దోహదపడేలా ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. సామాజికార్థిక మార్పులకు శ్రీకారం చుడుతూ భవిష్యత్ బడ్జెట్‌లా దీన్ని ఆర్థిక మంత్రి తీర్చిదిద్దారని వ్యాఖ్యానించారు.
రానున్న సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్ల స్ధాయికి ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలు, వెనుకబడిన తరగతులు, సంపన్న వర్గాలు అందరినీ ఈ బడ్జెట్ మెప్పించిందని చెప్పుకొచ్చారు.