అమేథీ: ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో ఇక పోరాడే సమయం వచ్చిందని, అందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు తన సోదరి ప్రియాంకతో కలిసి బుధవారం అమేథీకి వచ్చారు.ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఉత్తరప్రదేశ్‌లో రెండు సీట్లు(అమేథీ, రాయ్‌బరేలీ) మాత్రమే దక్కాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి రాహుల్ కొద్దిసేపు మాట్లాడారు. ‘యూపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బాగా లేకున్నా అమేథీ, రాయ్‌బరేలీ ప్రజలు మాత్రం పార్టీపై విశ్వాసం కనబరిచారు. అందుకు వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు పోరాడాల్సిన సమయం వచ్చింది. అందుకు మనం సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.