నరేంద్ర మోడీ మంత్రివర్గంలో 45మందికి చోటు దక్కినట్లు సమాచారం.
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ మంత్రివర్గంలో 44మందికి చోటు దక్కింది. వారిలో 23 మందికి కేబినెట్ హోదా, 11మందికి సహాయ మంత్రులు, 10మందికి స్వతంత్ర హోదా దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక రక్షణ శాఖను మోడీ తన ఆధ్వర్యంలోనే ఉంచుకోనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాధ్ సింగ్కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దక్కనుంది. విదేశాంగమంత్రిగా సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ, ఆరోగ్య శాఖ మంత్రిగా హర్షవర్థన్కు చోటు లభించే అవకాశం ఉంది. ఇక కేంద్ర కేబినెట్‌లో చేర్చుకునే సభ్యుల పేర్లను నరేంద్రమోడీ ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు.