సాక్షి, న్యూఢిల్లీ: పూల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్ విషయంలో భారత్‌కు రష్యా మద్దతు పలికింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు రష్యా అండగా ఉంటుందని ఆ దేశ మంత్రి డెనిస్ మాంతురొవ్ స్పష్టం చేశారు. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో తప్పకుండా భారత్‌కు అండగా ఉంటామని ఆయన తెలిపారు. పూల్వామా దాడి పట్ల భారత్‌కు రష్యా తరఫున తన సంతాపాన్ని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌కు రష్యా అండగా ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment