న్యూఢిల్లీ: దారిద్య్ర రేఖకు ఎగువ(ఏపీఎల్) ఉన్న కుటుంబాలకు డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ కనెక్షన్లను నెలసరి వాయిదా(ఈఎంఐ) పద్ధతిలో ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి గోయల్ రాష్ట్రాలను కోరారు. దీనికోసం అవసరమైన నిధులను ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌ల ద్వారా అందజేస్తామన్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా సమాచారాన్ని తెలుసుకోవడంతో సాయపడే జీఏఆర్‌వీ–2 యాప్‌ను ఆయన ప్రారంభించారు. 2019 నాటికి అందరికీ నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్య సాధనలో భాగంగా కేంద్రం పై విధానానికి శ్రీకారం చుట్టింది.